
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం (మార్చి 19) బార్లలో మహిళలు పనిచేసేందుకు అనుమతించే బిల్లుకు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆన్ కేటగిరీ మద్యం దుకాణాలలో మహిళల ఉపాధిపై నిషేధించే 1909 నాటి బెంగాల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించింది. మహిళల ఉపాధికి ఇది ఆటంకం.. ఈ చట్టం వివక్షతతో కూడుకున్నది. అందుకే చట్ట సవరణ చేసినట్టు పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య అన్నారు.
Also Raed : డెడ్ బాడీని దర్జాగా బైక్ పై అడవికి తీసుకెళ్లారు
సవరించిన ఈ బిల్లు ప్రకారం..నాటు సారా తయారీని నిరోధించేందుకు బెల్లంతో సహా ఇతర ముడి పదార్ధాలపై పర్యవేక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
ఈ బిల్లుతోపాటు వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టం, 1944ను కూడా సవరించనుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. కరోనా నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తేయాకు పరిశ్రమ, చిన్న తేయాలకు తోటలకు పన్ను నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ చట్టాన్ని సవరించారు.