పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి రాజ్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి ఆధ్వర్యంలో మోమిన్ పూర్ ప్రాంతంలో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘర్షణలపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మమత సర్కార్ ఘర్షణలను ప్రోత్సహిస్తోందని ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేల ర్యాలీతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే రాజ్భవన్లోకి అనుమతించారు. మరోవైపు రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం ఉండటంతో కేంద్ర బలగాలను పంపాలని కేంద్రానికి బీజేపీ నేతలు లేఖ రాశారు.