పొలాల్లోకి దిగిన సీఎం హెలికాప్టర్

పొలాల్లోకి దిగిన సీఎం హెలికాప్టర్

పశ్చిమబెంగాల్ సీఎం  ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెను ప్రమాదం తప్పింది. ఆమె  ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.  ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాతావరణ అనుకూలించకపోవడంతో పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. సరైన సమయంలో హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడంతో  సీఎం మమతా బెనర్జీకి ప్రమాదం తప్పింది. జల్పాయ్‌గురిలోని క్రింటిలో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ  ప్రసంగించిన తర్వాత  బాగ్‌డోగ్రా వెళ్తున్న సమయంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను  అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని టీఎంసీ నేత రాజీబ్ బెనర్జీ తెలిపారు.
 
జులై 8వ తేదీన పశ్చిమబెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా  ప్రచారం కోసం సీఎం మమతా బెనర్జీ ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. జూన్ 27వ తేదీ  జల్పాయ్‌గురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం  బాగ్‌డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే బైకుంతపూర్ అటవీ ప్రాంతం మీదుగా మమతా బెనర్జీ హెలికాప్టర్ వెళ్లాల్సి ఉంది. కానీ భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.  ఈ క్రమంలోనే  సిలిగురి సమీపంలో  హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. 

ALSO READ:శ్యామ్ చెల్లెలి పెళ్లి బాధ్యత మాది : ఎన్టీఆర్ స్వచ్ఛంద సంస్థ

హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో సీఎం మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆమె కోల్‌కత్తా బయలుదేరి వెళ్లనున్నారు.