మ్యాజిక్ ఫిగర్‌కు దూరమైన బీజేపీ.. మోదీ రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ

మ్యాజిక్ ఫిగర్‌కు దూరమైన బీజేపీ.. మోదీ రాజీనామా చేయాలి: మమతా బెనర్జీ

లోక్ సభ ఎన్నికలు 2024 ఉత్కంఠ భరితమైన ఫలితాలు అందించాయి. కేంద్రంలో ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు రాలేదు. దీంతో అన్ని పార్టీలు, కూటమిలు ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న ప్రాంతీయ పార్టీలతో  చర్చిస్తున్నాయి. ఈక్రమంలోనే ఇండియా కూటమికి అటుఇటుగా 230, ఎన్డీయే కూటమికి 290 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ సొంతంగా 239 మాత్రమే గెలిచేలా కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 272ని చేరుకోలేదు. దీంతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

అత్యధిక సీట్లు గెలుచుకున్న వెస్ట్ బెంగాల్ లో టీఎంసీ (29), ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (38), తమిళనాడులో డీఎంకే (22) బీహార్ లో నితీష్ కుమార్ జేడీయు పార్టీ (14), ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు టీడీపీ (20) పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేయనున్నాయి.