దీదీకి నానో మచ్చ

దీదీకి నానో మచ్చ

పశ్చిమ బెంగాల్​లో ఈ రోజు ఇండస్ట్రీలు మూతపడటానికి లెఫ్ట్​ పార్టీల ట్రేడ్​ యూనియన్లే కారణమని చాలా మంది అంటుంటారు. బెంగాల్​ ఎకానమీ దెబ్బతినటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నానో ప్రాజెక్ట్​ విషయంలో మమత చేసిన పోరాటాన్ని కార్పొరేట్​ ప్రపంచం మరచిపోవడం లేదు.

పరిశ్రమలపై ఇన్ఫ్లేషన్ పిడుగు

పరిశ్రమలు మూతపడి ఉద్యోగా​లు ఊడటంతో కార్మికులు ఆందోళనలకు దిగేవారు. దీనికి నక్సలిజం మూమెంట్​ తోడైంది. ఇన్​ఫ్లేషన్ రూపంలో మరో పిడుగు పడింది.​ ఎకానమీ మందగించటం, ఫ్రీట్​ ఈక్వలైజేషన్ పాలసీ​, కొత్త ఇండస్ట్రీలు వచ్చే దారి లేకపోవటం, రాష్ట్ర రాజకీయాలు మారిపోవటం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి.

పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు ఇండస్ట్రీలకు సెంటర్​గా ఉండేది. జనపనార (జ్యూట్​), తేయాకు (టీ) పరిశ్రమలకు పాపులర్​. దుర్గాపూర్​ స్టీల్​ ప్లాంట్, దామోదర్​ వ్యాలీ కార్పొరేషన్​ పవర్​ స్టేషన్, డెయిరీ బేస్డ్​ ఫ్యాక్టరీలు​ ఎన్నో వచ్చాయి. 1947‌‌‌‌–57లో యాన్యువల్​ కాంపౌండ్​ గ్రోత్​ రేట్​ 3.31 శాతం. ఇది ఆలిండియా యావరేజ్​ (2.75 పర్సంటేజీ) కన్నా ఎక్కువ.  ఈ  పరిస్థితి క్రమంగా దిగజారటం ప్రారంభమైంది. 1947 నుంచి 1977 వరకు 30 ఏళ్లలో  పాతికేళ్లపాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ హయాంలోనే ఇండస్ట్రియల్​ సెక్టార్​​ పడిపోవడం మొదలైంది.  ఆ తర్వాత పవర్​లోకి వచ్చిన లెఫ్ట్​ పార్టీలుగానీ, తృణమూల్​ కాంగ్రెస్​గానీ ఈ రంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పైగా, మమతా బెనర్జీ గతంలో టాటాల కార్ల ప్రాజెక్ట్​పై చాలా పెద్ద పోరాటమే జరిపారు. ప్రతిపక్షంలో ఉండగా, సింగూరులో నానో ప్రాజెక్ట్​కి భూమి కేటాయించడాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకించి, చివరకు ఆ ఫ్యాక్టరీ గుజరాత్​కి వెళ్లిపోయేలా చేశారు. ఈ విషయాల్ని కార్పొరేట్​ సెక్టార్​లో పెద్ద అపనమ్మకాన్ని సృష్టించింది.

ముందుకొచ్చిన మహారాష్ట్ర

మొదట్నుంచీ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​లో బెంగాల్​ కోల్పోతున్న స్థానాన్ని మహారాష్ట్ర భర్తీ చేయటం మొదలైంది. 1964 నాటికి ఆ రాష్ట్ర రాజధాని బొంబాయి (ముంబై)లో ఫ్యాక్టరీ రంగంలో బాగా ఉపాధి లభించేది. అప్పట్లో 13.53 లక్షల మంది కార్మికులకు మహారాష్ట్రలో ఉద్యోగాలు కల్పిస్తుండగా, బెంగాల్​లో​ కేవలం 8.87 లక్షల మందికే బతుకు దెరువు దొరికేది. 1966లో మహారాష్ట్ర ఇచ్చిన ఇండస్ట్రీ లైసెన్స్​లు బెంగాల్​ కన్నా ఎక్కువ ఉండేవి. పదేళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్​ పరిస్థితి మరింత తారుమారైంది. ఎక్స్​పోర్ట్​లు, ఇంపోర్ట్​లు సమానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం (ఫ్రీట్​ ఈక్వలైజేషన్​ పాలసీ) ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది.

నక్సలిజంతో తారుమారు

బెంగాల్​లో ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​తోపాటు అగ్రికల్చరల్​ గ్రోత్​​ కూడా కుంటుపడింది. ఈ సెక్టార్​లో 4.17 శాతం​ గ్రోత్​ రేట్​తో తమిళనాడు​ దూసుకుపోతే, బెంగాల్​ 1.94 పర్సంటేజీనే నమోదు చేసింది.

ఈ పరిస్థితుల్లో 1977లో లెఫ్ట్​ ఫ్రంట్​ అధికారంలోకి వచ్చింది. స్మాల్​, కాటేజ్​ ఇండస్ట్రీలకు ప్రయారిటీ ఇస్తూ ఆ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్​ పాలసీని తెచ్చింది. ఆర్గనైజ్డ్​ సెక్టార్​ని పూర్తిగా మార్చేయాలని ప్రయత్నించింది. కానీ.. లాభం లేకపోయింది. పాలసీ అమలు సరి​గా లేకపోవటం, రాష్ట్రంలోని లెఫ్ట్​ ప్రభుత్వానికి, కేంద్రంలోని కాంగ్రెస్​ సర్కార్​కి నడుమ పంచాయతీలు మైనస్​ అయ్యాయి. దీంతో 1980–90లో స్టేట్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​ (ఎస్డీపీ)లో పశ్చిమ బెంగాల్​ 13వ ర్యాంక్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భూ సంస్కరణలకే లెఫ్ట్​ ప్రయారిటీ

బెంగాల్​లో కాంగ్రెస్ పాలన ముగిసే నాటికే ఇండస్ట్రియల్​ సెక్టార్​ వెనకడుగు వేయటం ఆరంభమైందని ఎకానమీ రీసెర్చర్లు అంగీకరిస్తున్నారు. లెఫ్ట్​ ఫ్రంట్​ సర్కారు పంచాయతీరాజ్​, భూసంస్కరణలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఇండిస్ట్రియల్​ సెక్టార్​కి ఇవ్వలేదనేది చాలామంది ఒప్పుకుంటున్న మాట.

ఏదీ  వైభవం

జ్యోతిబసు తర్వాత బుద్ధదేవ్​ భట్టాచార్య హయాంలో బెంగాల్​ కాస్త కుదుట పడినా మునుపటి స్థాయికి ఈ సెక్టార్​ ఎదగలేదు. 2011లో లెఫ్ట్​ ఫ్రంట్​ ఓడిపోయి, మమతా బెనర్జీ (తృణమూల్​ కాంగ్రెస్​) సర్కారు వచ్చింది. ఇండస్ట్రియల్​ గ్రోత్​ కోసం పెట్టుబడులను మమత ఆహ్వానిస్తున్నా సరైన స్పందన రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రియల్ సెక్టార్​లో బెంగాల్​కి గత వైభవం రావటం ఇప్పట్లో అయ్యే పనికాదని అంటున్నారు.

 

జ్యూట్ ఇండస్ట్రీకి తీరని నష్టం

రెండో ప్రపంచ యుద్ధం సమయం(1939–45)లో బెంగాల్​ ప్రాంతంలో జ్యూట్​ ఇండస్ట్రీ బూమ్​ ఓ రేంజ్​లో ఉండేది. 1947లో ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అప్పుడే ఈ సెక్టార్ పతనం ప్రారంభమైందని అంటున్నారు. కోల్​కతాలోని ఐదు జ్యూట్​ మిల్లులు ఒకే ఏడాది మూతపడ్డాయి. జనపనార ముడి సరుకు, రేట్లు అందుబాటులో లేకుండా పోయాయి.