ఒడిశా రైలు ప్రమాదం.. బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

 ఒడిశా రైలు ప్రమాదం..  బెంగాల్ బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.  రైలు ప్రమాదంలో మరణించిన  రాష్ట్రానికి చెందిన వారి కుటుంబాలకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున  ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి ఒక్కొక్కరికి రూ. 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 50 వేలను  ప్రకటించారు.  ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎంఓ ట్వీ్ట్ చేసింది.  

https://twitter.com/ANI/status/1664916766601138176

ఈ ప్రమాదంలో బెంగాల్ కు చెందిన ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారు.  ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉండవచ్చునని సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై కేంద్రం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన తరుణమని అన్నారు మమత. హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు చేరుకున్న మమతా బెనర్జీ ... కటక్ లోని ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. 

మరోవైపు ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 03వ తేదీన ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది..మరణించిన ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి PMNRF  తరుపున రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.