కోల్కతా: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్నాయి. తాజాగా బెంగాల్ సైతం కరోనా నిబంధనల్లో మార్పుచేసింది. నైట్ కర్ఫ్యూ సమయాన్ని గంట మేర కుదించింది. గతంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండగా.. తాజాగా ఆ సమయాన్ని రాత్రి 11 గంటల ఉదయం 5గంటల వరకు మార్చింది. కేసుల సంఖ్య తగ్గుతున్నందున హై స్కూళ్లు రీఓపెన్ చేసుకోవచ్చని మమత సర్కారు ప్రకటించింది. 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ఆఫ్లైన్ తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతించింది. కాలేజీలు, యూనివర్సిటీలు సైతం ఫిజికల్ క్లాస్లు ప్రారంభించుకోవచ్చని చెప్పింది. రెస్టారెంట్లు, బార్లు, సినిమా హాళ్లు 75శాతం కెపాసిటీతో ఓపెన్ చేసుకోవచ్చని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పార్కులు, టూరిస్టు ప్లేసులను తెరవవచ్చని స్పష్టం చేసింది.
West Bengal CM Mamata Banerjee announces relaxation in COVID restrictions: Night curfew to be in force between 11pm-5am instead of 10pm-5am. Restaurants, bars, and cinema halls to operate at 75% capacity. Parks & tourist places to reopen with COVID safety protocols." pic.twitter.com/F3JjHqMru0
— ANI (@ANI) January 31, 2022