కోల్‎కతా వైద్యురాలి హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. వెస్ట్ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం

కోల్‎కతా వైద్యురాలి హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. వెస్ట్ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం

కోల్‎కతా ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‎కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని వెస్ట్ బెంగాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  వైద్యురాలిపై అత్యంత దారుణంగా హత్యాచారానికి పాల్పడిన దోషికి ఉరి శిక్ష విధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరుతామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన దోషి సంజయ్ రాయ్‎కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. 

ALSO READ | ‘ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్’.. వైద్యురాలి హత్యాచార కేసు తీర్పుపై CM మమతా బెనర్జీ అసంతృప్తి

‘‘ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాదని ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఇది మరణశిక్ష అమలు చేసే అరుదైన కేసు అని నేను నమ్ముతున్నాను. ఇది అరుదైన కేసు కాదని తీర్పు ఎలా వచ్చింది..? అత్యంత దుర్మార్గమైన, సున్నితమైన ఈ కేసులో దోషికి మరణశిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. ఇటీవల, గత 3/4 నెలల్లో మేము అటువంటి నేరాలలో దోషులకు ఉరిశిక్ష లేదా గరిష్ట శిక్ష పడేలా చేయగలిగాం. అలాంటప్పుడు ఈ కేసులో దోషికి ఉరిశిక్ష ఎందుకు విధించలేదు..? ఇది ఉరిశిక్ష విధించే ఘోరమైన నేరమని నేను గట్టిగా భావిస్తున్నాను. దోషికి ఉరి శిక్ష విధించాలని మేం హైకోర్టుకు వెళ్తాం’’ అని సీఎం మమతా ట్వీ్ట్ చేశారు. 

అసలు కేసు ఏంటంటే..?

2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్‎కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‎గా పని చేసే సంజయ్ రాయ్‎గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ALSO READ | కోల్‏కత్తా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కోల్‎కత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. నిందితుడు సంజయ్ రాయ్‎కు పాలిగ్రాఫ్ టెస్ట్ సైతం నిర్వహించింది. సంజయ్ రాయ్‎కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‎ను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది.