వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆనంద బోస్ కాన్వాయ్‌ను ఓ ప్రైవేట్ కారు ఢీకొట్టింది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ బోస్ ఆనంద బోస్ కాన్వాయ్ ని కారు ఢీ కొట్టిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విచిత్ర వీర్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని చెప్పారు.
ALSO READ :- పార్లమెంట్ ఎన్నికల్లోపు.. 2 గ్యారంటీలు అమలు : అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన
ఢీకొన్న తర్వాత, కాన్వాయ్ ఆగలేదు మరియు కదులుతూనే ఉందని డీసీపీ విచిత్ర తెలిపారు. గవర్నర్ సెక్యూరిటీ యాక్సిడెంట్ పై పోలీసులకు సమాచారం ఇచ్చారని ఢీ కొన్నది టాక్సీ కార్ ను అధుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నిందితుడు అజిత్ ను విచారిస్తున్నామని డీసీపీ విచిత్ర వీర్ తెలిపారు.