పోలింగ్ బూత్‌లో విషాదం.. CRPF జవాన్ మృతి

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఉత్తర బెంగాల్‌లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహిస్తు్న్నారు. కూచ్‌బెహార్‌లోని మాతభంగాలో పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహించడానికి వచ్చిన సీఆర్‌పీఎఫ్ జవాన్ అనుమానస్పదంగా మృతి చెందాడు. బీహార్‌కు చెందిన నీలేష్ కుమార్ (42) మాతభంగాలోని బెల్టాలా పోలింగ్ బూత్ లో డ్యూటీ చేస్తున్నాడు. తెల్లవారితే ఎలక్షన్ అనంగా గురువారం అర్థరాత్రి నీలేష్ కుమార్ బాత్ రూంలో పడిఉన్నాడు. అతని ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై అస్వస్థతకు గురయ్యాడు. తలకు గాయాలు కూడా ఉన్నాయి.

వెంటనే మఠభంగా సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే జవాన్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. జవాన్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియదు. నీలేష్ కుమార్ క్విక్ రెస్పాన్స్ టీమ్ లో పని చేస్తున్నాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు. రాత్రి నీలేష్  ఏ ఆహారం తిన్నాడు. అంతకు ముందు అతని హెల్త్ కండీషన్ ఏంటి అన్న కోణంలో ఉన్నత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.