హైదరాబాద్, వెలుగు: సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు తొలి ఓటమి ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో తెలంగాణ 0–3తో బలమైన వెస్ట్ బెంగాల్ చేతిలో పరాజయం పాలైంది. బెంగాల్ తరఫున నరోహరి శ్రేస్త (45+3, 56 వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా.. రోబి హన్స్‌డా (39వ ని) ఓ గోల్ సాధించాడు. ఆతిథ్య తెలంగాణ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సర్వీసెస్ 4–0తో జమ్మూ కాశ్మీర్‌పై ఘన విజయం సాధించింది. ఇంకో మ్యాచ్‌లో మణిపూర్ 2–1తో రాజస్తాన్‌ను ఓడించింది.