Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్.. వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

Women's T20 World Cup 2024: కెప్టెన్‌గా హేలీ మాథ్యూస్.. వరల్డ్ కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ కు వెస్టిండీస్ తమ 15 మంది సభ్యుల స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ జట్టుకు  కెప్టెన్ గా సీనియర్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ ను ఎంపిక చేశారు. ఇటీవలే అంతర్జాతీయ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న డియాండ్రా డాటిన్ స్క్వాడ్ లో స్థానం సంపాదించింది. వైస్-కెప్టెన్ గా షెమైన్ కాంప్‌బెల్లే వ్యవహరిస్తుంది. స్టాఫానీ టేలర్,డాటిన్ లాంటి అనుభవమున్న ఆటగాళ్లను విండీస్ జట్టు నమ్ముకుంది.

 మాథ్యూస్, చినెల్లే హెన్రీ, జైదా జేమ్స్, మాండీ మాంగ్రూ లాంటి ఆల్ రౌండర్లతో జట్టు నిండిపోయింది. అనుభవం.. యువకులతో కూడిన జట్టు సమతుల్యంగా ఉంది. టీ20 ప్రపంచ కప్‌లో గట్టి పోటీ ఇవ్వడానికి విండీస్ మహిళల జట్టు సిద్ధంగా ఉంది అని క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్కోంబ్ చెప్పుకొచ్చారు. పది జట్లు తలపడే ఈ టోర్నీ అక్టోబర్ 3-20 వరకు జరగాల్సి ఉంది. పాల్గొనే 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ 1 ఉండగా..  ఆతిథ్య బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, క్వాలిఫయర్‌ 2 గ్రూప్‌-బి లో ఉన్నాయి. 

Also Read:-ఆల్‌టైం రికార్డులే లక్ష్యంగా

మహిళల T20 ప్రపంచ కప్ కు వెస్టిండీస్ జట్టు:

హేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అలీన్, షామిలియా కానెల్, డియాండ్రా డాటిన్, షెమైన్ కాంప్‌బెల్లే (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసార్, అఫీ ఫ్లెచర్, స్టాఫానీ టేలర్, చినెల్లే జోసెఫ్ నేషన్, చెడియన్ నేషన్, చెడియన్ నేషన్ , జైదా జేమ్స్, కరిష్మా రామ్‌హారక్, మాండీ మాంగ్రు, నెరిస్సా క్రాఫ్టన్