SL vs WI 2024: దేశం కన్నా డబ్బే ముఖ్యం: శ్రీలంక పర్యటనకు నలుగురు వెస్టిండీస్ ప్లేయర్స్ దూరం

SL vs WI 2024: దేశం కన్నా డబ్బే ముఖ్యం: శ్రీలంక పర్యటనకు నలుగురు వెస్టిండీస్ ప్లేయర్స్ దూరం

నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్ ఈ నలుగురు ఆటగాళ్లు టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ లీగ్ ల్లో ఎక్కడ ఆడినా ఎన్నో మ్యాచ్ ల్లో ఒంటి చేత్తో తమ జట్లకు విజయాలను అందించారు. అయితే జాతీయ జట్టుకు వచ్చే సరికీ వీరికి ఆడడం కుదరడం లేదు. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటున్నారు.

ఈ నలుగురు కూడా శ్రీలంక పర్యటనకు వ్యక్తిగత కారణాలు చెప్పి దూరంగా అయ్యారు. దీంతో వెస్టిండీస్ జట్టు ఒక్కసారిగా బలహీన పడింది. పూరన్, రస్సెల్, హెట్మెయర్, హోసేన్ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాదు. ఈ స్క్వాడ్ విషయానికి వస్తే ప్రధాన కోచ్ డారెన్ సామీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వన్డే,టీ20 జట్లకు ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్‌లను ఎంపిక చేసింది. 2022 లో టీ20 ప్రపంచ కప్ తర్వాత లూయిస్ వెస్టిండీస్ జట్టులోకి తిరిగి వచ్చాడు. బ్రాండన్ కింగ్ 2024 టీ20 వరల్డ్ కప్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. 

ALSO READ | IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా

శ్రీలంక పర్యటనకు వెస్టిండీస్ వన్డే, టీ20 జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రోవ్‌మన్ పావెల్ టీ20 జట్టుకు..షాయ్ హోప్ వన్డే జట్టుకు కెప్టెన్సీ చేస్తారు. అక్టోబర్ 13 నుంచి 17 వరకు దంబుల్లాలో మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం 20 నుంచి 26 వరకు పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ ఉంటుంది. 

శ్రీలంక టూర్ కోసం వెస్టిండీస్ స్క్వాడ్స్

టీ20 జట్టు:

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోమరియో షెపర్డ్ మరియు షమర్ స్ప్రింగర్.

వన్డే జట్టు:

షాయ్ హోప్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్ మరియు హేడెన్ వాల్ష్ జూనియర్.