ఐపీఎల్ ముగింపుకు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. వారంలో లీగ్ మ్యాచ్ లు ఆ తర్వాత వారంలో ప్లే ఆఫ్ మ్యాచ్ లు ముగుస్తాయి. అయితే ప్లే ఆఫ్ కు వెళ్లే జట్లకు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్లలోని సౌతాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఈ మెగా లీగ్ కు దూరం కానున్నారు. దీనికి కారణం వెస్టిండీస్ స్వదేశంలో టీ20 సిరీస్ నిర్వహించడమే. టీ20 వరల్డ్ కప్ కు ముందు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ మూడు టీ 20 మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తుంది.
మే 23న తొలి టీ20, మే 25న రెండో మ్యాచ్, మే 26న సిరీస్ లో చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మూడు మ్యాచ్ లు జమైకాలోని సబీనా పార్క్ లో జరుగుతాయి. అదే సమయంలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో విండీస్ క్రికెటర్లతో పాటు సఫారీ క్రికెటర్లు ఈ మ్యాచ్ కు దూరం కానున్నారు. ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్ 1 మే 21న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాతి రోజు(మే 22) ఎలిమినేటర్ జరుగుతుంది. మే 24న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్ 2 జరగనుండగా.. ఇదే వేదికపై మే 26న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది.
ఐపీఎల్ లో వెస్టిండీస్ ఆటగాళ్ల ఫ్రాంచైజీ జట్టు:
రోవ్‌మన్ పావెల్ (రాజస్థాన్ రాయల్స్), షిమ్రాన్ హెట్మెయర్ (రాజస్థాన్ రాయల్స్), అల్జారీ జోసెఫ్ (RCB), షాయ్ హోప్ (ఢిల్లీ క్యాపిటల్స్), షమర్ జోసెఫ్ (లక్నో సూపర్ జెయింట్స్), నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్), ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్ రైడర్స్) , రొమారియో షెపర్డ్ (ముంబై ఇండియన్స్)
ఐపీఎల్ లో దక్షిణాఫ్రికా ఆటగాళ్ల ఫ్రాంచైజీ జట్టు:
ఐడెన్ మార్క్రామ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), మార్కో జాన్సెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), గెరాల్డ్ కోయెట్జీ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డి కాక్ (లక్నో సూపర్ జెయింట్స్), కేశవ్ మహరాజ్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ మిల్లర్ (గుజరాత్ టైటాన్స్) , అన్రిచ్ నోర్ట్జే (దక్షిణాఫ్రికా), కగిసో రబడ (పంజాబ్ కింగ్స్), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్)
South Africa's T20I tour of West Indies is set to clash with the #IPL2024 playoffs.#WIvSA #WIvsSAhttps://t.co/HMVqZSZLMG
— IndiaTVSports (@IndiaTVSports) May 11, 2024