వెస్టిండీస్ జట్టు క్రికెట్ లో తనదైన ముద్ర వేసే పనిలో ఉంది. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధింలేకపోయిన విండీస్..కోలుకోవడం కష్టమే అని భావించారు. అయితే విండీస్ ఇంత త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. స్వదేశంలో ఇంగ్లాండ్ పై అదరగొట్టి 2-1 తో వన్డే సిరీస్ గెలిచిన కరేబియన్ జట్టు.. తాజాగా 3-2 తేడాతో టీ20 సిరీస్ గెలిచారు.
వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ పై గెలవడంతో విండీస్ క్రికెట్ పాత రోజులను గుర్తు చేస్తుందని ఆ దేశ క్రికెట్ అభిమానులు సంతోషపడుతున్నారు. 5 టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు (డిసెంబర్ 22) వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య చివరి టీ20 జరిగింది. 133 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షై హోప్(43), రూథర్ ఫోర్డ్(30), విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా.. హోప్ సిక్స్ కొట్టి లాంఛనాన్ని పూర్తి చేసాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 19.3 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. 38 పరుగులతో సాల్ట్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. లివింగ్ స్టోన్(28), మొయిన్ అలీ(23) భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. విండీస్ స్పిన్నర్ మోటీ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. రస్సెల్, అకెల్ హుస్సేన్, హోల్డర్ కు తలో రెండో వికెట్లు లభించాయి. విండీస్ స్పిన్నర్ మోటీకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
ODI series win ✅
— ESPNcricinfo (@ESPNcricinfo) December 21, 2023
T20I series win ✅
West Indies do the double over England ?? #WIvENG pic.twitter.com/4b8lIr7Up4