
ప్రొవిడెన్స్ (గయనా) : టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ భారీ విజయాన్ని అందుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ (5/11) బౌలింగ్‌లో చెలరేగడంతో.. ఆదివారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 134 రన్స్ భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. టాస్ గెలిచిన విండీస్ 20 ఓవర్లలో 173/5 స్కోరు చేసింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ (13) విఫలమైనా, జాన్సన్ చార్లెస్ (44), ఆండ్రీ రసెల్ (30 నాటౌట్) మెరుగ్గా ఆడారు.
మిడిల్‌లో నికోలస్ పూరన్ (22), పావెల్ (23), రూథర్‌ఫోర్డ్ (22) అండగా నిలిచారు. ఛేజింగ్‌లో ఉగాండా 12 ఓవర్లలో 39 రన్స్‌కే కుప్పకూలింది. జుమా మియాగి (13) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ మొత్తంలో 10 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.