మాజీ ప్రపంచ ఛాంపియన్స్ వెస్టిండీస్ క్రికెట్ లో తమదైన ముద్ర వేసే పనిలో ఉంది. పేలవ ఆటతీరుతో భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయిన విండీస్.. స్వదేశంలో మెరుగైన ఆటతీరును ప్రదర్శించి ఇంగ్లాండ్ పై 2-1 తేడాతో సిరీస్ నెగ్గింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన విండీస్..25 ఏళ్ళ తర్వాత ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ గెలిచి తమ చెత్త రికార్డ్ కు బ్రేక్ వేసుకుంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే వెస్టిండీసీ తొలి వన్డే, ఇంగ్లాండ్ రెండు వన్డే గెలిచాయి. నిర్ణయాత్మకమైన మూడో వన్డే నిన్న (డిసెంబర్ 9) జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ 40 ఓవర్లకు కుదించగా.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ షపర్డ్ చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడి విండీస్ కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 41 పరుగులు చేసిన ఈ విండీస్ ఆల్ రౌండర్ బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 206 పరుగులు మాతరమే చేయగలిగింది. బెన్ డకెట్ 71 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లోయర్ ఆర్డర్ లో లివింగ్ స్టోన్ 45 పరుగులు చేసి రాణించాడు. లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటింగ్ చేస్తుండగా మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ 34 ఓవర్లలో 188 పరుగులుగా సెట్ చేశారు. విండీస్ ఈ లక్ష్యాన్ని 31.4 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ అతనాజ్ 45 పరుగులు చేయగా కార్టి 50 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు పెద్దగా రాణించకున్నా షెపర్డ్ లాంఛనాన్ని పూర్తి చేసాడు.