బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): భారీ టార్గెట్ ఛేజింగ్‌లో బ్రెండన్ కింగ్ (102), కేసీ కార్టీ (128 నాటౌట్) దంచికొట్టడంతో.. బుధవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 263/8 స్కోరు చేసింది.
ఫిల్ సాల్ట్ (74), డాన్ మౌస్లీ (57), సామ్ కరన్ (40), ఆర్చర్ (38), ఓవర్టన్ (32) రాణించారు. మాథ్యూ ఫోర్డీ 3, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫర్డ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 267/2 స్కోరు చేసి గెలిచింది. ఎవిన్ లూయిస్ (19) ఫెయిలైనా.. కింగ్, కార్టీ రెండో వికెట్‌కు 209 రన్స్ జోడించారు. కింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ఫోర్డీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.