బసెటెరె: బౌలింగ్‌లో జేడెన్ సీల్స్ (4/22), బ్యాటింగ్‌లో బ్రెండన్ కింగ్ (82) సత్తా చాటడంతో బంగ్లాదేశ్‌తో రెండో వన్డే లో ఆతిథ్య వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా 45.5 ఓవర్లలో 227 రన్స్‌కే ఆలౌటైంది.
మహ్ముదుల్లా (62), తంజిద్ హసన్ (46), తంజిద్ హసన్ షకీబ్ (45) రాణించారు. కరీబియన్ బౌలర్లలో సీల్స్ నాలుగు, గుడకేశ్ మోతీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేజింగ్‌లో విండీస్ 36.5 ఓవర్లలోనే 230/3 స్కోరు చేసి సులువుగా నెగ్గింది. ఎవిన్ లూయిస్ (49), కేసీ కార్టీ (45) కూడా రాణించారు.