- రెండో మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా ఓటమి
తరౌబా (ట్రినిడాడ్) : సొంతగడ్డపై బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆకట్టుకున్న వెస్టిండీస్ వరుసగా రెండో టీ20 మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ సొంతం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన రెండో టీ20లో ఛేజింగ్‌లో తడబడిన సఫారీ టీమ్ 40 రన్స్ తేడాతో ఓడింది. దాంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 0–2తో సిరీస్ చేజార్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కరీబియన్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 179/6 స్కోరు చేసింది.
షై హోప్ (22 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (22 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 35), షెర్ఫానె రూథర్‌ఫర్డ్ (29) రాణించారు. సఫారీ బౌలర్లలో లిజాద్ విలియమ్స్ మూడు, పాట్రిక్ క్రుగర్ రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 149 రన్స్‌కే ఆలౌటై ఓడింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (18 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 44), ట్రిస్టాన్ స్టబ్స్ (28)
ర్యాన్ రికెల్టన్ (20) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు. రొమారియో షెఫర్డ్, షామెర్ జోసెఫ్ చెరో మూడు వికెట్లతో విండీస్‌ను గెలిపించారు. షెఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం రాత్రి జరుగుతుంది.