మేమే తోపులం: ఇండియా లక్కీగా వరల్డ్ కప్ గెలిచింది: విండీస్ దిగ్గజం

మేమే తోపులం: ఇండియా లక్కీగా వరల్డ్ కప్ గెలిచింది: విండీస్ దిగ్గజం

క్రికెట్ ప్రపంచంలో టీమిండియా ఈరోజు ఇలా ఉందన్నా.. ఈ స్థాయికి చేరిందన్నా దానికి కారణం '1983 వరల్డ్ కప్'. ఆరోజుల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్టేలియా జట్లదే ఆధిపత్యం. భారత జట్టును ఒక పసికూన జట్టుగా చూసేవారు. అలాంటిది కపిల్ సారథ్యంలోని టీమిండియా.. ఫైనల్ మ్యాచ్‌లో అప్పటికే రెండుసార్లు ప్రపంచ కప్ విజేత అయిన వెస్టిండీస్‌ని ఓడించి చరిత్ర సృష్టించింది. టీమిండియా గతినే మార్చింది. అయితే ఇదంతా లక్ అంటున్నారు.. అప్పటి వెస్టిండీస్ బౌలర్ ఆండీ రాబర్ట్స్.   

"అవును, మేం ఇండియా చేతుల్లో ఓడాం. వెస్టిండీస్ జట్టు పతనానికి కారణమైన ఓటముల్లో ఇది కూడా ఒకటి. క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. మేం అన్నింటికీ సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ మా కంటే బలమైన జట్టును ఇప్పటివరకూ చూడలేదు. మ్యాచ్ జరిగే ఆ ఒక్క రోజు ఎవరి టైం బాగుంటే వారే గెలుస్తారు. ఫైనల్‌ మ్యాచ్‌లో అదే జరిగింది. అదృష్టం భారత్ వైపు ఉన్నది.. వారు గెలిచారు. అంతేకానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఓడలేదు." 

"1975 నుంచి 1983 వరకూ మమ్మల్ని ఓడించిన జట్టు లేదు. ఒక్క 1983లోనే రెండు సార్లు ఓడాం. అదీ కూడా రెండు పర్యాయాలు.. ఇండియా చేతిలోనే. ఆ సమయంలో భారత జట్టు అదృష్టం బాగుందనుకుంటా!. మా జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నారు. ఇండియాలో చెప్పదగ్గ ప్లేయర్లు ఎవ్వరూ లేరు. అయినా గెలిచారంటే అదే కారణం. అంతెందుకు వరల్డ్ కప్ తర్వాత ఇండియాతో జరిగిన సిరీస్‌లో 6-0 తేడాతో గెలిచాం. ఏదో లక్‌ కలిసి వచ్చి వారు విజయం సాధించారు.." అని ఆండీ రాబర్ట్స్ స్పోర్ట్స్‌స్టార్‌ తో చెప్పుకొచ్చాడు.

1983 వరల్డ్ కప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ దాన్ని చేధించలేకపోయింది. 52 ఓవర్లలో 140 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్(26 పరుగులు), బౌలింగ్(3 వికెట్లు) రెండింటిలోనూ రాణించిన మొహిందర్ అమర్ నాథ్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.