బాసెటెరె : సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య వెస్టిండీస్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో అరంగేట్రం ఆటగాడు అమిర్ జాంగో (104 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటడంతో గురువారం రాత్రి జరిగిన మూడో, చివరి వన్డేలో విండీస్ 4 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 321/5 స్కోరు చేసింది. మహ్ముదుల్లా (84 నాటౌట్), కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ (77)
సౌమ్య సర్కార్ (73), జాకిర్ అలీ (62 నాటౌట్) రాణించారు. అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం విండీస్ 45.5 ఓవర్లలో 325/6 స్కోరు చేసి గెలిచింది. జాంగోతో పాటు కేసీ కార్టీ (95), గుడకేశ్ మోతీ (44 నాటౌట్) సత్తా చాటారు. జాంగోకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, షెర్ఫానె రూథర్‌ఫొర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.