సొంతగడ్డపై జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం క్రికెట్ వెస్టిండీస్ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ కు ముందు ఇరు జట్లు ఆడుతున్న చివరి సిరీస్. విండీస్ లోనే వరల్డ్ కప్ జరగనుండడంతో ఆటగాళ్లకు ఈ సిరీస్ ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించినా.. ఆ దేశ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి ద్వితీయ శ్రేణి జట్టును పంపనుంది.
ప్రస్తుతం వెస్టిండీస్ స్టార్ ప్లేయర్లు రస్సెల్, హెట్ మేయర్, కెప్టెన్ రోవ్ మన్ పావెల్ ఐపీఎల్ లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడుతుండడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వారి నిర్ణయాన్ని గౌరవించింది. ఈ జట్టుకు బ్రాడం కింగ్ కెప్టెన్సీ చేయనున్నాడు. హోప్, పూరన్, అల్జారీ జోసెఫ్ లాంటి స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చారు. అంతకముందు క్రికెట్ సౌత్ ఆఫ్రికా సైతం విండీస్ టూర్ కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్ట్ చేసింది. మార్కరంకు రెస్ట్ ఇవ్వడంతో రాస్సీ వాన్ డెర్ డుస్సెన్ ప్రొటీస్ జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో ముగ్గురు స్టార్ ప్లేయర్లు డికాక్, నోకియా, కొయెట్జ్ లను సెలక్ట్ చేశారు.
కెప్టెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడ , ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ , కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ లాంటి స్టార్ ఆటగాళ్ళు ఈ సిరీస్ కు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. వీరిలో సన్ రైజర్స్ తరపున మార్కరం, క్లాసన్, మార్కో జాన్సెన్ ఉన్నారు. మే 23 నుంచి మే 26 వరకు విండీస్ లో మూడు టీ20లు జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్ లకు జమైకా ఆతిధ్యమిస్తుంది.
West Indies T20 squad for the South Africa series. pic.twitter.com/5adSwizPnt
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 19, 2024