వెస్టిండీస్ వేదికగా ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్ లో మొత్తం మూడు వన్డేలు, 5 టీ20లు జరుగుతాయి. వన్డేలతో ప్రారంభం కానున్న ఈ సిరీస్.. నవంబర్ 17 న ఐదో టీ20తో ముగుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్ ముగిసింది. స్వదేశంలో వెస్టిండీస్ 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది. శనివారం (నవంబర్ 9) తొలి టీ20 ప్రారంభం కానుంది. ఇరు జట్లలో పవర్ హిట్టర్లు ఉండడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ హండ్రెడ్ లీగ్ ఆడుతూ బట్లర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కు దూరమయ్యాడు. బట్లర్ చేరికతో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ టీ20 జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా మారింది. జాఫర్ చోహన్, డాన్ మౌస్లీ, జాన్ టర్నర్ తొలిసారి ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
మరోవైపు పావెల్ సారథ్యంలో వెస్టిండీస్ బలంగా కనిపిస్తుంది. లూయిస్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మెయర్ లాంటి హిట్టర్లతో పటిష్టంగా కనిపిస్తుంది.
ALSO READ : CK Nayudu Trophy: చరిత్ర సృష్టించిన యశ్వర్ధన్ దలాల్.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు
లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య బార్బడోస్‌లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత కాలమాన ప్రకారం శనివారం (నవంబర్ 9) అర్దరాత్రి 1:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. దురదృష్టవశాత్తు.. ఈ మ్యాచ్ ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం లేదు. ఈ మ్యాచ్ ను చూడాలంటే ఫ్యాన్‌కోడ్ యాప్ తో పాటు వెబ్‌సైట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.