WI vs PAK: తీసుకున్న గోతిలోనే పడ్డారు: 34 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ గెలిచిన వెస్టిండీస్

WI vs PAK: తీసుకున్న గోతిలోనే పడ్డారు: 34 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ గెలిచిన వెస్టిండీస్

ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. సొంతగడ్డపై పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇస్తూ 120 పరుగుల తేడాతో గెలిచింది. తొలి టెస్ట్ మాదిరిగానే స్పిన్ ట్రాక్ పై విండీస్ జట్టును చుట్టేద్దామనుకున్న ఆతిధ్య పాకిస్థాన్ కు ఈ సారి నిరాశ తప్పలేదు. రెండు ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమై విండీస్ ధాటికి తలొంచింది. మ్యాచ్ గెలవడంతో 2 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. 34 ఏళ్ళ తర్వాత పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. చివరిసారిగా 1990లో పాకిస్థాన్ గడ్డపై విండీస్ టెస్ట్ గెలిచింది.    

Also Read :  మరికొన్ని గంటల్లో బిగ్ బాష్ లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?    
     
జోమెల్ వారికన్ హవా:

254 పరుగుల లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోర్ 4 వికెట్లను 76 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్థాన్ మరో 57 పరుగులు జోడించి చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోర్ వద్ద సౌద్ షకీల్(13), అలీ (1) ఔటయ్యారు. మహ్మద్ రిజ్వాన్,సల్మాన్ అఘా 39 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా  వారికన్ ధాటికి సమాధానం లేకుండా పోయింది. 18 పరుగుల స్వల్ప వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. జోమెల్ వారికన్ ఐదు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు వారికన్ కు దక్కాయి.   

అంతకముందు మొదట బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకదశలో 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోత్ కష్టాల్లో పడిన వెస్టిండీస్ జట్టును లోయర్ ఆర్డర్ ఆదుకున్నారు. గుడాకేష్ మోతీ 55 పరుగులు చేసి జట్టును ఆదుకోగా..  కెమర్ రోచ్,జోమెల్ వారికన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరి రెండు వికెట్లను వెస్టిండీస్ ఏకంగా 109 పరుగులు జోడించడం విశేషం.తొలి రోజు ఆట ముగి సేసమయానికి పాకిస్థాన్ 154 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ కు 9 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో బ్రాత్‌వైట్ (52) హాఫ్ సెంచరీతో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌట్ అయింది.