జార్జ్‌టౌన్: పసికూన పపువా న్యూగినియాపై కష్టపడి గెలిచిన వెస్టిండీస్.. టీ20 వరల్డ్ కప్‌లో శుభారంభం చేసింది. చిన్న ఛేజింగ్‌లో రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్), బ్రెండన్ కింగ్ (34) రాణించడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో నెగింది. టాస్ ఓడిన పపువా న్యూగినియా తొలుత 20 ఓవర్లలో 136/8 స్కోరు చేసింది. సేసే బావు (43 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టార్టింగ్ నుంచే విండీస్ బౌలర్లు రాణించడంతో న్యూగినియాకు మంచి ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు టోనీ ఉరా (2), కెప్టెన్ అసద్ వాలా (21), లిగా సియాకా (1), హిరి హిరి (2) నిరాశపరిచారు.
చార్లెస్ అమిన్ (12) సేసేతో ఐదో వికెట్‌కు 44 రన్స్ జోడించి వెనుదిరిగాడు. 42 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సేసే 17వ ఓవర్‌లో ఔటయ్యాడు. చివర్లో కిప్లిన్ డోరిగా (27), చాద్ సోపర్ (10) పోరాటంతో న్యూగినియా స్కోరు 130 దాటింది. రసెల్, అల్జారీ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 19 ఓవర్లలో 137/5 స్కోరు చేసింది. గినియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్ తడబడింది. ఓపెనర్ చార్లెస్ (0) డకౌట్ అయ్యాడు. పూరన్ (27), బ్రెండన్ కింగ్ రెండో వికెట్‌కు 53 రన్స్ జోడించారు. అయితే, ఈ ఇద్దరితో పాటు పావెల్ (15)ను ఔట్ చేసిన గినియా బౌలర్లు సంచలనం సృష్టించేలా కనిపించారు. కానీ, చివర్లో ఛేజ్, ఆండ్రీ రసెల్ (15 నాటౌట్) వరుస బౌండ్రీలతో మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్ ముగించారు. అసద్ వాలా రెండు వికెట్లు తీశాడు. ఛేజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.