వర్ధన్నపేట, వెలుగు : కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదివారం వరంగల్జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని సిబ్బందికి తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో అన్ని రికార్డులు పరిశీలించి, తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ను సందర్శించి వర్ధన్నపేట ఎస్సై, సిబ్బందికి ట్రాఫిక్ విషయంలో పలు సూచనలు చేశారు.