మెహిదీపట్నం, వెలుగు: మాసబ్ ట్యాంక్ ఏరియాలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన యాజిలీ ప్రకాశ్, యూసుఫ్ గూడ ప్రాంతానికి చెందిన మేధారి కవిత కలిసి మాసబ్‌ట్యాంక్‌లోని సందర్శిని హోటల్ఎదురుగా అమేజింగ్ పేరుతో బ్యూటీ సెలూన్, స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు.
ముగ్గురు యువతులను బ్యూటీషియన్లుగా నియమించుకుని, వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం స్పా సెంటర్‌పై దాడి చేసి ముగ్గురు యువతులను, ఆసిఫ్ నగర్ కు చెందిన విటుడు షేక్ ఫైజల్, ప్రకాశ్, కవితను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాసబ్ ట్యాంక్ పోలీసులకు అప్పజెప్పారు. ప్రకాశ్, కవిత, షేక్ ఫైజల్‌ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువతులను సేఫ్ జోన్ కు తరలించామన్నారు.