దక్షిణ ముంబైలోని చర్చిగేట్ వద్ద ఆగస్టు 8 ఉదయాన సిగ్నల్ లోపం కారణంగా పశ్చిమ రైల్వే లోకల్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు.
సిగ్నల్ వైఫల్యం కారణంగా, ఉదయం రద్దీ సమయంలో డబ్ల్యూఆర్ సబర్బన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ముంబై లైఫ్ లైన్‌గా పరిగణించే రైళ్లు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు వాపోయారు.
చర్చ్‌గేట్-బౌండ్ ఫాస్ట్ లైన్‌లోని సిగ్నల్ లో ఉదయం 8.50 గంటలకు టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో రైళ్లను తరువాత 30 నిమిషాల పాటు అప్ స్లో లైన్‌లో మళ్లించాలని అధికారులను సూచించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ALSO READ :సమస్యల పరిష్కారానికి కదం తొక్కిన డ్రైవర్లు
గంటన్నర తరువాత మళ్లీ ప్రారంభం..
టెక్నికల్ఇష్యూని సరిచేసిన గంటన్నరకు అంటే ఉదయం 9.30 ప్రాంతంలో రైలు సేవలు తిరిగి ప్రారంభమైనట్లు ఆఫీసర్లు చెప్పారు. పశ్చిమ రైల్వే చర్చిగేట్ (దక్షిణ ముంబైలో), దహను (పాల్ఘర్‌లో) స్టేషన్ల మధ్య సబర్బన్ సేవలు అందిస్తోంది.