- 31వ డివిజన్ అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లు
- ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్పరిధిలోని 31వ డివిజన్ అభివృద్ధి పనులకు రూ.2.50 కోట్లను కేటాయించినట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. పలు అభివృద్ధి పనులకు బల్దియా మేయర్గుండు సుధారాణితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపనలు చేశారు. సిటీ పరిధిలో ఉన్న శాయంపేటకు పట్టణ శోభను తీసుకురావడానికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించాలని కోరగా, స్థానికులు ముందుకు రావడం హర్షణీయమన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.