ఇంటింటి కీ వెళ్లి చెక్ చేయనున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
దొరికితే బుక్ చేస్తారు
ఇదివరకే రెండు ప్లాస్టిక్ డబ్బాలు పంపిణీ చేసిన బల్దియా
పక్కాగా అమలు చేసేందుకు అధికారుల ప్లాన్
మీ ఇంట్లో రోజూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారా? జీహెచ్ ఎంసీ అధికారులు మీ ఇంటికివచ్చి చెక్ చేస్తారు. ఒకవేళ మీరు వేరు వేరు డబ్బాల్లో వేయకపోతే ఫైన్ కూడా వేసే అవకాశాలున్నాయి. ఇక నుంచి స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా కఠినంగా వ్యవహరించాలని బల్దియా నిర్ణయించింది. ఇది వరకే ప్రతీ ఇంటికి రెండు చెత్త డబ్బాలు ఇచ్చి ఒక దాంట్లో తడి, మరో దాంట్లో పొడి చెత్తవేయాలని ప్రచారం చేసింది. అయినా సిటీలో చాలామంది పాటించడం లేదు. దీంతో స్వచ్ఛభారత్ అభియాన్ నిబంధనల ప్రకారం తడి చెత్త, పొడి చెత్త వేరు చేయని వారిపై రోజుకు రూ.200 జరిమానా విధించే అవకాశాలున్నాయి.
నిత్యం 4300 మెట్రిక్ టన్నుల సేకరణనగరంలో ప్రతిరోజు 4300 మెట్రిక్ టన్నుల చెత్తను బల్దియా సేకరిస్తోంది. అయినప్పటికీ ఇంకా కవర్ గాని గృహాల నుంచి చెత్త సేకరించేందుకు గాను అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అన్ని ఇళ్లనుంచి గార్బేజ్ సేకరణ గాను అదనపు ఆటోలను,ట్రక్కులను కొనుగోలు చేయాలని జీహెచ్ఎంసీభావిస్తోంది. ఇలాం టి సౌకర్యాలు ఎన్ని కల్పించినా ప్రజల సహకారం లేకుండా సత్ఫలితాలు సాధించలేమని జీహెచ్ ఎంసీ యోచిస్తోంది.అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడానికి గృహిణులను చైతన్య పరిచేందుకు స్వయం సహాయక మహిళా సభ్యులు కృషిచేస్తున్నారు.44 లక్షల డస్ట్ బిన్ల పంపిణీ తడి, పొడి చెత్తగా వేరు చేసి అందించడానికి దేశంలో మరే నగరంలో లేనంత గా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 లక్షల కుపైగా ఉన్నఇళ్లకు ఇంటింటికి రెండు డస్ట్ బిన్ ల చొప్పున 44ల క్షల డస్ట్‌బిన్ ల ను ఉచితంగా పంపిణీ చేశారు.ఎవరి ఇంట్లో ఉత్పత్తయ్యే చెత్తను వారే తడి, పొడిచెత్తగా విడదీసి అందిం చాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఒకొక్క స్వచ్ఛ ఆటోకు 500 ఇళ్లను కేటాయిచారు.
ఈ 500 ఇళ్ల నుండి చెత్తను సేకరించాలనే లక్ష్యాన్ని ఆటోలకు నిర్థారించడంతో ప్రతి ఆటో డ్రైవర్, మరో ఇద్దరు సహాయకులతో చెత్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుపై ఇంటింటికి తిరిగి గృహిణులను , యజమానులను చైతన్య పరిచేందుకు స్వచ్ఛదూత్ మహిళా కార్యక ర్తలతో 1,088 నివాస ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు.కోటి మందికి 18 వేలమంది కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలోపారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు కేవలం 18వేల మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ప్రజల సహకారం లేకుండా సంపూర్ణ స్వచ్ఛత సాధించలేమని, అందుకే జరిమానా విధిం చడంపై దృష్టిసారించామని అధికారులు చెబుతున్నారు.