32 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం

చలికాలం దేశ రాజధానిలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చలికి ఢిల్లీ ప్రజలు గజగజ వణుకుతుంటారు. ఇక దీనికితోడు వాయుకాలుష్యం, వైరస్ సైతం ఢిల్లీ వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. అయితే తాజాగా ఢిల్లీలో వర్షాలు కురిశాయి. చిన్నపాటి వర్షం కురిసిన ఈ మహా నగరం తడిసి ముద్దవుతుంది. ఈ ఏడాది జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిమీ వర్షపాతం నమోదైంది. 32 ఏళ్లలో ఈ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. శనివారం ఉదయం 9.30 గంటలకు 69.8 మిమీ వర్షపాతం నమోదైందని ఐఎండి సీనియర్‌ అధికారి తెలిపారు. 

1989 జనవరిలో 79.7 మిమీ వర్షపాతం నమోదైన తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని అన్నారు. ఐఎండి ప్రకారం.. వర్షం కురవడంతో... ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 14.7 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సగటు కంటే ఏడు డిగ్రీలు తక్కువ. ఇప్పటి వరకు సీజన్‌లో కనిష్టంగా ఉంది. దీంతో చలితో ప్రజలు వణికిపోయారు. కాగా, గాలి నాణ్యత శనివారం చాలా పేలవంగా ఉంది. వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) అదే రోజు సాయంత్రం 316గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా తెలిపింది.

ఇవి కూడా చదవండి: 

దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి

మేం లేకుంటే దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాదు