రూ.500 కోట్లు సేకరించిన వీవర్క్​

న్యూఢిల్లీ: కోవర్కింగ్ కంపెనీ వీవర్క్ ఇండియా సోమవారం రైట్స్ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సేకరించింది. అప్పులను తగ్గించి, మరింత వృద్ధిని సాధించడానికి ఈ నిధులను ఉపయోగించనుంది. అన్‌‌లిస్టెడ్ వీవర్క్ ఇండియాలో, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్​కు 73 శాతం వాటా ఉండగా, వీవర్క్ గ్లోబల్​కు 27 శాతం వాటా ఉంది.

ఫ్లెక్సిబుల్ వర్క్‌‌స్పేస్ ప్రొవైడర్ అయిన వీవర్క్ గ్లోబల్... జూన్ 2021లో వీవర్క్ ఇండియాలో 100 మిలియన్​ డాలర్లను పెట్టుబడి పెట్టింది.  ఎంబసీ గ్రూప్ కూడా భారీ పెట్టుబడి పెట్టింది. ఈ ఇష్యూతో వచ్చిన డబ్బుతో తమ అప్పులన్నీ తీరిపోతాయని వీవర్క్​ ఇండియా ఎండీ, సీఈఓ కిరణ్​ వీర్వానీ చెప్పారు.