
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మంగళవారం ఎత్తి వేసింది. దీంతో అమన్‌లో జరగబోయే ఆసియా చాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్‌ను ఎత్తి వేశామని మినిస్ట్రీ ప్రకటించింది.
గతేడాది డిసెంబర్ 21న కొత్తగా ఏర్పడిన ఫెడరేషన్ కార్యవర్గంలో పాలన, విధానపరమైన లోపాలు ఉండటంతో అదే నెల 24న మినిస్ట్రీ.. డబ్ల్యూఎఫ్‌ఐని సస్పెండ్ చేసింది. అప్పట్నించి ఐవోఏ అడ్‌హక్ ప్యానెల్ ఫెడరేషన్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో.. డబ్ల్యూఎఫ్‌ఐకి కొత్తగా ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో బ్రిజ్ అనుచరుడు సంజయ్ సింగ్ ప్రెసిడెంట్‌గా గెలిచాడు.