సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌లో తిమింగలం..

సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌లో తిమింగలం..

 సముద్రంలో సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌ చేయాలంటేనే చాలా గుండె ధైర్యం కావాలి. అలాంటి సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌లోకి హఠాత్తుగా ఓ తిమింగలం వస్తే ఎలా ఉంటుంది. రేస్‌‌‌‌‌‌‌‌ సంగతేమోగానీ, ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుంటాం. తాహితీ సముద్రంలో మంగళవారం జరిగిన సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో ఈ దృశ్యం ఆవిష్కృత మైంది. సెమీస్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తతియా నా వెస్టన్‌‌‌‌‌‌‌‌ (బ్రెజిల్‌‌‌‌‌‌‌‌), బ్రిసా హెన్నెసీ (కోస్టారికా) సముద్రపు అలలపై సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ఉన్నట్టుండి వాళ్ల వైపు ఓ బ్లూ వేల్‌‌‌‌‌‌‌‌ దూసుకొ చ్చింది. దాన్ని చూసిన సర్ఫర్లు ఒడ్డు వైపు వేగంగా వచ్చేశారు. సర్ఫర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చినా, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌, ఫొటోగ్రాఫర్లకు మాత్రం జీవితకాలం మర్చిపోలేని అనుభూతిని అందించింది. సర్ఫింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నప్పుడు పక్షులు, సీల్స్‌‌‌‌‌‌‌‌, చిన్న సొర చేపలు వంటి రావడం సాధారణంగా జరుగుతుంది. కానీ తిమింగలం రావడమే హైలెట్‌‌‌‌‌‌‌‌.