కొత్త ఏడాదిలో ఇలా: జోస్యం చెబుతున్న సమంత

జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడే సమంత.. చాలా విషయాల్లో పాజిటివ్‌‌ మైండ్‌‌ సెట్‌‌తో ముందుకెళుతుంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియబోతున్న నేపథ్యంలో..  వచ్చే ఏడాది తన కెరీర్‌‌‌‌, పర్సనల్‌‌ లైఫ్‌‌ ఎంతో బాగుండబోతున్నాయంటూ జోస్యం చెబుతోందామె. వచ్చే ఏడాది  వృషభ, మకర, కన్యరాశిల వారి లైఫ్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో ఓ పోస్ట్ చేసింది సమంత.

ఇందులో ఆమెది వృషభ రాశి.  ‘ఏడాదంతా బిజీగా ఉంటారు, వృత్తిపరంగా మెరుగవడంతో పాటు డబ్బులు ఎక్కువ సంపాదించి, ఆర్థికంగా పుంజుకుంటారు. ఆదాయ మార్గాలు, మరిన్ని అవకాశాలు పొంది, మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్‌‌గా ఉంటారు’ అనే అంశాలు ఇందులో ఉన్నాయి.

ALSO READ : ధనుష్ కొత్త మూవీలో అమెరికన్ నటి

అయితే వీటితో పాటు ‘‘నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు, పిల్లలను పొందుతారు” అనే మాటలు అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. దీంతో కొత్త ఏడాది మరొకరితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.  ఏదేమైనా 2025లో తన లైఫ్‌‌ సూపర్‌‌‌‌గా ఉండేలా సమంత ప్లాన్ చేస్తోందని అర్థమవుతోంది.