
- ప్రభుత్వానికి ఉమ్టా ప్రపోజల్స్..
- రిజిస్ట్రేషన్లు, పెట్రో, డీజిల్ పై పన్ను తరలించాలని ప్రపోజల్స్
- డెవలప్మెంట్ ఫండ్ కొనసాగింపు
- సీబీడీ సెస్పైనా ఆలోచన
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్‌రోడ్ నుంచి ట్రిపుల్ఆర్వరకూ ఎక్స్టెండ్అవుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రజా రవాణా, మౌలిక సదుపాయల కల్పన అవసరమని ప్రభుత్వం, అధికారులు భావిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల నేపథ్యంలో మెరుగైన ప్రజా రవాణా సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై విధి విధానాలను రూపొందించేందుకు హెచ్ఎండీఏలోని అర్బన్ మెట్రోపాలిటన్ట్రాన్స్పోర్ట్ అథారిటీ( ఉమ్టా) నేతృత్వంలో సమగ్ర ట్రాన్స్పోర్ట్సర్వే చేయిస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర అవసరాల కోసం నిధులు అవసరమవుతాయి కాబట్టి అర్బన్ ట్రాన్స్పోర్ట్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉమ్టా భావిస్తోంది. కావాల్సిన ఫండ్ రెయిజ్ చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ సిద్ధం చేసినట్టు సమాచారం.
నిధులు సేకరించే ప్లాన్ ఇలా..
యూటీఎఫ్‌కు ఫండ్స్సమకూర్చడానికి అవసరమైన మార్గాలను ఉమ్టా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా నగరంలో రోజుకు దాదాపు 3 వేల నుంచి 4 వేల వాహనాలు విక్రయం జరుగుతున్నాయని గుర్తించింది. వీటి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తోంది. ఈ ఆదాయం నుంచి కొంత యూటీఎఫ్ కు తరలించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే, పెట్రోల్, డీజిల్అమ్మకాల పై ప్రభుత్వం విధిస్తున్న పన్నుల్లో కొంత యూటీఎఫ్‌కు తరలించాలని ప్రపోజల్స్ పెట్టింది. హెచ్ఎండీఏ చట్టం ప్రకారం నగరంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో హెచ్ఎండీఏకు 1.25 శాతం డెవలప్‌మెంట్‌ఫండ్ కింద చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు. దీన్ని కూడా ఇంప్లిమెంట్చేస్తే యూటీఎఫ్‌కు కావాల్సినంత ఫండ్ సమకూరుతుందని ఆలోచిస్తోంది.
సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్సెస్
దేశంలోని కొన్ని నగరాల్లో సెంట్రల్బిజినెస్ డిస్ట్రిక్ట్స్(సీబీడీ)ఉన్నాయి. ఆయా జోన్లలో వివిధ వ్యాపారాలు, వాణిజ్య కార్యకలాపాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీని ఆధారంగా సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్‌పేట, అబిడ్స్వంటి కొన్ని ప్రాంతాలను సీబీడీలుగా ప్రకటించి నిర్ణీత సమయాల్లో ఈ ప్రాంతం నుంచి ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ దగ్గర సెస్ రూపంలో కొంత మొత్తాన్ని వసూలు చేసే విషయంపై కూడా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.