సైబర్ మోసాలు జరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి.. మేనేజర్ల పాత్రపై హైకోర్టు సీరియస్

సైబర్ మోసాలు జరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయి..  మేనేజర్ల పాత్రపై హైకోర్టు సీరియస్

సైబర్ నేరాల కేసుల్లో తెలంగాణ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. సైబర్ మోసాలు జరుగుతుంటే బ్యాంకులు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఒకేరోజు ఒకే అకౌంట్ కు దాదాపు 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అవుతుంటే మేనేజర్లు ఏం చేస్తున్నారని మండిపడింది. సైబర్ మోసాలపై బ్యాంకుల పాత్రపై గురువారం (మార్చి 27) హైకోర్టు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఒకే ఖాతాకు ఒక్కరోజులోనే 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ఆరా తీసింది. కేరళలోని ఎర్నాకుళం ఎస్బీఐ బ్యాంక్ కీజ్మాడ్ శాఖపై తెలంగాణ హైకోర్టు  ఆరా తీసింది.  సైబర్ నేరగాళ్లు అమాయకుల అకౌంట్లనుంచి అంత మొత్తంలో కొల్లగడుతుంటే బ్యాంకు మేనేజర్ ఏం చేస్తున్నారని మండిపడింది.  

ఈ సందర్భంగా బ్యాంకులో  కరెంట్ అకౌంట్స్ తెరిచేందుకు ఆర్బీఐ నిబంధనలు పాటించారా అని ప్రశ్నించింది. RBI  నిబంధనలను పాటించారో లేదో  రెండు వారాల్లో వివరణ  ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో బ్రాంచ్ మేనేజర్ NV  శ్రావణ్ కుమార్ కు   హైకోర్టు ఆదేశాలు జారీ  చేసింది. 

ఇటీవల డిజిటల్ అరెస్ట్  పేరుతో వరవరావు అనే వ్యక్తి  50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అదే రోజు భారత్ ఎంటర్ ప్రైజెస్  ఖాతాలోకి ఒకే రోజు 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.  చాలా మంది బాధితుల నుంచి 5 కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. అకౌంట్లో డబ్బు డిపాజిట్ , విత్ డ్రా విషయంలో బ్యాంకు మేనేజర్  వైఫల్యం చెందారని హై కోర్ట్.. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.