స్మోకింగ్ ఈజ్ ఇంజురియాస్ టు హెల్త్.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెల మీద, సినిమా హాళ్లలో యాడ్స్ వేస్తున్నా... సిగరెట్ తాగేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గట్లేదు. సిగరెట్స్ కి తోడుగా ఇప్పుడు ఈ - సిగరెట్స్ ట్రెండ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా యూత్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఈ - సిగరెట్స్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఉండదన్న అపోహ ఒకవైపు, సిగరెట్ లాగా దీన్ని పిలిచినప్పుడు దుర్వాసన ఉండకపోవడంతో యూత్ ఈ - సిగరెట్ కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఈ - సిగరెట్ ని వైప్ అని కూడా పిలుస్తారు.
అయితే, ఈ - సిగరెట్ కూడా ఆరోగ్యానికి హానికరం అని చాలా అధ్యయనాల్లో తేలింది. సిగరెట్ వల్ల ఎన్ని అనార్థాలున్నాయో.. ఈ - సిగరెట్ వల్ల కూడా అన్ని అనార్థాలున్నాయని తేలింది. ఈ - సిగరెట్ కి బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది.
ఈ-సిగరెట్ల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్యాన్సర్ కారక ఎలక్ట్రానిక్ సిగరెట్ అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటు న్నారు. వీటి అమ్మకాలు ఎక్కువగా జరిగే గ్రేటర్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఎగుమతి, దిగుమ తులు.. అమ్మణాలపై నిఘా పెట్టారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోల్ సీల్ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు.
Also Read :- పార్ట్ టైమ్ జాబ్ అంటూ వాట్సాప్ లో మెసేజ్
సముద్ర తీర ప్రాం తాలైన ముంబయి, గోవా, వెస్ట్ బెంగాల్, చెన్నై నుంచి ఎక్కువగా ఇవి దిగుమతి అవుతున్నాయి. ఏటా సుమారు 1.5 నుంచి వెలక్షల ఈ-సిగరెట్స్ సిటీకి వస్తున్నట్టు తెలుస్తోంది. బేగంబజార్, సిద్ది అంబర్ బజార్, సికింద్రాబాద్ లోని హోల్ సేల్ మార్కెట్ల నుంచి రిటైల్ మార్కెట్ కి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సిటీ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఒక్కో ఈ-సిగరెట్ ధర రూ.300 నుంచి బ్రాండ్, ఫ్లేవర్స్ ని బట్టి రూ. 1500 దాకా అమ్ముతున్నారు. రీహాబిలిటేషన్ కౌన్సెలింగ్ తో కొంతకాలం వీటిని వాడుతున్నారు. తర్వాత అది వ్యసనంగా మారుతోంది. దీంతో పొగతో పాటు నికోటిన్, ప్రొఫైలైన్, గ్లిజరిన్ వంటి ద్రవ పదార్థాల తో ఎలక్ట్రానిక్ స్మోక్ కి బానిసలవుతున్నారు. క్యాన్సర్ కారకాలు ఎక్కువ ఈ-సిగరెట్ లోని కాట్రిడ్జిలలో డీ ఇథైల్ గ్జికాల్ అనే విషపూరిత పదార్థంతో పాటు నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉంటాయి, బ్యాటరీతో కూడిన నికోటిన్ ద్రవం ద్వారా కాలుష్యం విడుదలవుతంది.
పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే పెదాలు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులతో పాటు దంత వ్యాధుల వస్తున్నాయి. బ్యాటరీ వేడితో ద్రవ పదార్థం స్మోక్ గా మారడం వల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ (ఇన్ఫెక్షన్) ఏర్పడుతుంది. అలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ లో ఏర్పడే పొగ పీల్చడం దీర్ఘకాలంగా కొనసాగితే ఎంపసిమా, బ్రాంకైటిస్, గుండెజబ్బుల వంటి వ్యాధులు వస్తాయి.