Good Food : బీట్ రూట్ తిన్నా.. బీట్ రూట్ జ్యూస్ తాగినా.. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయా..!

Good Food : బీట్ రూట్ తిన్నా.. బీట్ రూట్ జ్యూస్ తాగినా.. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉంటాయా..!

రక్తహీనత..దీనినే ఎనిమియా అంటారు.. ఎనిమియా అంటే శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడం. ఎర్ర రక్త కణాలు శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. రక్తహీనత వివిధ రకాలుగా ఉంటుంది.  విటమిన్ B12 లోపం వల్ల వచ్చే రక్తహీనత. ఫోలేట్ (ఫోలిక్ యాసిడ్) లోపం వల్ల రక్తహీనత ప్రధానమైనవి.  అయితే ఎనిమియాకు చెక్ పెట్టడం ఎలాం..? రోజు మనం తీసుకునే ఆహారంలో ఏం తీసుకుంటే రక్త హీనతను అరికట్టవచ్చో మనం తెలుసుకుందాం..

సహజంగా లభించే ఆహారంలో బీట్రూట్ ఒకటి. దీంలో పోషకాలు చాలా ఉంటాయి. శాకాహార దుంపల్లో బీట్ రూట్ ప్రత్యేకస్థానం. దీంట్లో నైట్రేట్ నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్లుగా మారి రక్త సరఫరాను పెంచుతాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.విటమిన్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం,గోళ్లు, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెదవులు పొడి బారకుండా చూస్తుంది. డైట్ పాటించే వాళ్లు బీట్ రూట్ను  తీపి బదులుగా తీసుకోవడం మంచిది. దీంట్లోని కార్బొహైడ్రేట్స్ మంచి శక్తినిస్తాయి. 

ALSO READ | Telangana Tour : ఆకాశమంత లక్నవరం చూసొద్దామా.. హైదరాబాద్ నుంచి ఇలా వెళ్లాలి.. ఇవి చూడాలి..!

మహిళలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ దీంట్లో పుష్కలంగా ఉంది. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ని మందుల రూపంలో తీసుకోవడం కన్నా. ఇలా సహజంగా తీసుకోవటం ఉత్తమం. పిల్లల మెదడు చురుకుగా ఉంచడంతో పాటు వాళ్లకు తక్షణ శక్తిని ఇవ్వడానికి బీట్ రూట్ బెటర్. దీంట్లోని విటమిన్ ఎ,బీ,బీటైన్, క్యాల్షియం, మినరల్స్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవాళ్లు బీట్ రూట్ రసం తాగితే తొందరగా కోలుకుంటారు.