Good Health : వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

Good Health : వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!
  • బయట ఫుడ్ జోలికి వెళ్లకూడదు. రోడ్ సైడ్ ఫుడ్లో వాడే నూనె, పిండి, కూరగాయల్లో ఏ మాత్రం కల్తీ జరిగినా అవి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 
  • ఇంట్లో కూడా అన్ని రకాల పండ్లు, కూరగాయలను నీటిలో శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి.
  • జ్వరం వచ్చినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. నాన్వెజ్ తివొద్దు.
  • రోజు తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సోంపు, పసుపు వంటివి కలిసేలా చూడాలి. 
  • వేడి చేసిన, ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. చల్లని నీటికి దూరంగా ఉండటం మంచిది.
  • తినేవాటి మీద ఎప్పుడూ మూతలు ఉండేలా చూసుకోవాలి.
  • వంటచేసే ప్లేస్ ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కూడా కొంతవరకు వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 
  • నీళ్లు ఎక్కువ రోజులపాటు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. 
  • వీలైనంత వరకు ఇళ్లలో కొంత వేడిఉండేలా చూసుకోవాలి. చల్లని వాతావరణం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా మరింత వ్యాపించే అవకాశంఉంటుంది.
  • భోజనానికి ముందు, తరువాత చేతులను శుభ్రం చేసుకోవడం మంచిది.
  • పిల్లలు, ముసలి వారికి కొన్ని రకాల వ్యాధులు వేగంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి.