లిక్కర్ స్కాం కేసులో కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ రెండూ కేసుల్లో కవితకు ఊరట లభించింది. రెండు కేసుల్లో బెయిల్ కు గానూ ఆమె రూ10 లక్షల ష్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలి. అంతేకాకుండా కేసు నమోదు అయిన స్థానిక మేజిస్ట్రేజ్ కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లాలంటే మెజిస్ట్రేట్ కోర్టు పర్మీషన్ తీసుకోవాలి. లిక్కర్ స్కాం కేసులో సాక్ష్యాలను, సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్తూ ఈ మూడు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో తర్వాతి విచారణకు సహకరిస్తూ.. వాయిదాలకు హాజరుకావాలని సూచించింది సూప్రీం కోర్టు.
ఈ ఏడాది మార్చి 15 సాయంత్రం ఈడీ కవితను అరెస్ట్ చేసి.. ఢిల్లీ తరలించింది. 153 రోజుల పాటు కస్టడీలో ఉంది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ గంటన్నర సేపు వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45(1)లోని ప్రొవిజో బెయిల్ విషయంలో మహిళలు ప్రత్యేక పరిశీలనకు అర్హులని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వరుసగా ఛార్జిషీట్ తోపాటు ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేశాయని ఆయన తెలిపారు. ఆమె ఈడీ కేసులో ఐదు నెలలు, సీబీఐ కేసులో నాలుగు నెలలు కస్టడీలో ఉన్నారు. రెండు కేసుల్లో మొత్తం సాక్షుల సంఖ్య 493 అని, మొత్తం డాక్యుమెంట్ల సంఖ్య దాదాపు 50,000 పేజీలని కవిత లాయర్ రోహత్గీ కోర్టుకు చెప్పుకొచ్చారు.