మంచి, చెడు శకునాలపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. కలలో వచ్చే వాటిని నమ్మొచ్చా..?

మంచి, చెడు శకునాలపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. కలలో వచ్చే వాటిని నమ్మొచ్చా..?

భారతీయ సంప్రదాయంలో జ్యోతిష్యానికి మరియు శకునాలకు చాలా ప్రాధాన్యత ఉంది.  మన జీవితంలో జరిగే సంఘటనలను శకునాలు అంటారని పండితులు చెబుతున్నారు.  కాని అవి వ్యతిరేకంగా ఉంటాయి. విచిత్రంగా ఉంటాయి.  కొన్ని శుకునాలు మంచివి.. అమి మనకు ఆనందంతో సంపదను కూడా ఇస్తాయని నమ్ముతుంటాం, ఏ శకునాలు మంచి ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారో తెలుసుకుందాం. . . 

కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి.  చాలా మందిని వాటిని పట్టించుకోరు.  అలాంటి వాటినే శకునాలు అంటారు.  కొన్ని శుకునాలు చెడును సూచిస్తే.. మరికొన్ని శుభ ఫలితాలను ఇస్తాయి.  పండితులు చెప్పిన వివరాల ప్రకారం శుభప్రదంగా భావించే శకునాలు ఇవే.. 

  • మీకు స్వప్నంలో (కలలో) దేవుడు కనిపిస్తే చాలా మంచిది.  ఇది శుభ శకునంగా వేదాల్లో చెప్పబడింది.  కలలో వినాయకుడు కనిపిస్తే మీరు అనుకొనే పనులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణం అవుతాయి.
  • కొన్ని ముఖ్యమైన పనులకు వెళ్లే దారిలో నెమలి కనిపిస్తే మంచి సూచకంగా చెబుతున్నారు.  నెమలి నృత్యం చేస్తే అంతా విజయమే చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. 
  • కొన్ని కలలు చాలా భిన్నంగా ఉంటాయి.  కలలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన స్త్రీ కనిపిస్తే అది కూడా మంచి సూచనగానే భావిస్తారు. మీకు ఇలాంటి కల వస్తే ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
  • మీ జేబులో ఉన్న నోటు, నాణెం పడిపోతే అది శుభప్రదంగా చెబుతున్నారు.  ఇలా జరిగితే త్వరలో మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందట.
  • నల్ల కుక్కను చూడటం వలన చాలా మంచి జరుగుతుంది.
  • మీరు ఎటైనా వెళ్లేటప్పుడు థర్డ్ జండర్స్ కనిపిస్తే కచ్చితంగా డబ్బులు ఇవ్వడం వలన మీకు మంచి జరుగుతుంది.  ఒక రూపాయి అయినా సరే వారి వద్దనుంచి వెనక్కు తీసుకొని విలువైన నాణేలుగా ఉంచుకోవడం చాలా శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.