
ఈ ప్రపంచాన్ని రెండు సంవత్సరాలు గడగడలాడించిన కరోనా వైరస్ మరో కొత్త అవతారమెత్తింది. ఈ ఇప్పటికే పలు వేరియంట్లతో ప్రజలను అతలాకుతలం చేయగా.. ఇప్పుడు ఎరిస్ అనే వేరియంట్ తో మరోమారు తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. EG 5.1 అని పిలవబడే ఈ వేరియంట్ కేసులు ప్రస్తుతం యునైటైడ్ కింగ్ డమ్ అంతటా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో మునుపటితో పోలిస్తే ఇప్పుడు నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ప్రస్తుతం నమోదవుతోన్న ఏడు కరోనా కేసుల్లో ఒకటి ఎరిస్ వేరియంట్ కు కారణమని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. యూకే రెండవ అత్యంత ప్రబలంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్.. ఇప్పటికే యూరప్, ఉత్తర అమెరికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో దాని ఉనికిని ప్రారంభించింది.
UKHSA ప్రకారం, అంతర్జాతీయంగా ముఖ్యంగా ఆసియాలోని పలు నివేదికల ప్రకారం ఈ ఏడాది జూలై 3న ఎరిస్‌ను మొదటి సారి గుర్తించారు. యూకేలో పెరుగుతున్న కేసుల్లో 11.8 శాతం ఏరిస్ వేరియంట్ ల నమోదవుతున్నట్టు జూలై 10న వెల్లడైంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌ల కొవిడ్ వేరియంట్ ల జాబితాలో చేర్చింది.
జో హెల్త్ అధ్యయనం ప్రకారం ఏరిస్ సంకేతాలు & లక్షణాలు..
1. గొంతు నొప్పి
2. ముక్కు కారటం
3. ముక్కు మూసుకుపోవటం
4. తుమ్ములు
5. పొడి దగ్గు
6. తలనొప్పి
7. తడి దగ్గు
8. బొంగురు స్వరం
9. కండరాల నొప్పి
10. వాసన కోల్పోవడం
ఈ వేరియంట్ సైతం దాదాపు ఒమిక్రాన్ వేరియంట్ లాంటి లక్షణాలనే కలిగి ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. పలు నివేదికల ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన కోల్పోవడం, జ్వరం ప్రధాన లక్షణాలు కావు. అయితే కేసుల పెరుగుదలకు ఇదే మూల కారణం అని మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రోగనిరోధక శక్తి క్షీణించడం వంటివి ఈ వేరియంట్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీంతో ఎక్కువ మంది వైరస్ బారిన పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎరిస్ కు నివారణ:
ఈ కొత్త కోవిడ్ వేరియంట్ నుంచి రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం సరైన శానిటైజేషన్, లక్షణాలు కనిపించగానే సామాజిక దూరాన్ని నిర్వహించడమే.