బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారు..? ప్రభుత్వ విప్లు, MLAలకు సీఎం క్లాస్

బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారు..?  ప్రభుత్వ విప్లు, MLAలకు సీఎం క్లాస్

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత  MLAలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ విప్లు, MLAలకు సీఎం క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. 

‘‘మనం లిక్కర్ పాలసీ తెచ్చము.. వాళ్లు పాలసీ అనేదే లేకుండా వచ్చింది వెనక్కి వేసుకున్నారు. దీనిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు’’ అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రభుత్వ విప్ లు పని తీరు మార్చుకోవాలని, కేటాయించిన సభ్యులు అన్ని విషయాల పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 

Also Read:-మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ..19న బడ్జెట్..

ప్రభుత్వ విప్ లు అందరూ అన్ని విషయాలు మాట్లాడాలని అనుకోవద్దని, ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించారు. ఫ్లోర్ కో ఆర్డినేషన్ పకడ్బందీగా చేయాలని ఎంఎల్ఏలతో సీఎం రేవంత్ అన్నారు.