టెంపరేచర్ పెరగడానికి ఈ మూడు కారణాలు

టెంపరేచర్ పెరగడానికి ఈ మూడు కారణాలు

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. దీంతో ఆ ఏరియాల్లో రేడియేషన్ విపరీతంగా పెరిగింది. సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకాయి. చెట్లు, బిల్డింగ్​లు కూడా లేకపోవడం, బంజరు భూమి ఎక్కువగా ఉండటంతో వేడి పెరిగింది. దీనికితోడు రాజస్థాన్ వైపు నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. సాధారణంగా సిటీ శివారు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. దీనికి రేడియేషన్ తోడవడంతో ఆ ఏరియాల్లో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 2002, ఢిల్లీలో గరిష్టంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సాధారణం కంటే 9 డిగ్రీలు అధికంగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

మూడు కారణాలు

  •     టెంపరేచర్లు విపరీతంగా పెరగడానికి 3 కారణాలు ఉన్నాయని మూడీస్ ఆర్ఎంఎస్​లో చీఫ్ రీసెర్చ్ ఆఫీసర్​ రాబర్ట్ ముయిర్ వుడ్ తెలిపారు. మొదటిది.. భూమి, రోడ్లలో డార్క్ మెటీరియల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. గ్లాస్, కాంక్రీట్ మెటీరియల్ కూడా వేడిగా ఎక్కువగా గ్రహిస్తాయి. 
  •     మెట్రో పాలిటన్ సిటీల్లో ఎత్తయిన భవనాలు ఉంటాయి. ఇవి గాలి వేగాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా హీట్ పెరుగుతుంది. 
  •     సిటీ సెంటర్​లో ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్లు, మెషనరీలు ఎక్కువ. కార్లు కూడా ఎక్కువే.  ఇవన్నీ హీట్​ను ప్రొడ్యూస్ చేస్తా యి. వేడి పెరగడం అనేది అక్కడి జనాభా పైనా ఆధారపడి ఉంటుంది. మిగతా ఏరియాల కన్నా సిటీ సెంటర్​లో 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది.