
జనాలు ప్రతి కార్యక్రమానిగుర్తుగా రిబ్బన్లు వాడుతుంటారు. అయితే ఒక్కోకలర్ రబ్బన్ ఒక్కో కార్యక్రమానని సూచిస్తుంది. సాధారణంగా జబ్బులు, సంతాపాలు, నిరసనలను తెలిపేందుకు సందర్భాన్ని బట్టి ఒక్కో కలర్ రిబ్బన్ పెట్టుకుంటాం. కొన్ని జబ్బులు.. వాటి పేర్లతో కంటే, వాటిని సూచించే కలర్ రిబ్బన్తోనే తెలిసిపోతాయి. కానీ.. ఏ కలర్ రిబ్బన్ ఏ సందార్భాల్లో పెట్టుకోవాలో.. చాలామందికి తెలియదు. ఇప్పుడు ఏ కలర్ రిబ్బన్ దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం. . .
వైట్ : గర్భిణులపై దాడులు జరిగినప్పుడు, అందుకు వ్యతిరేకంగా తెలిపే నిరసన కార్యక్రమాల్లో వైట్ రిబ్బన్ పెట్టుకుంటారు. శాంతి, అహింసల కోసం తెలుపుతూ జరిగే కార్యక్రమాల్లో కూడా తెల్ల రిబ్బన్ ఉపయోగిస్తారు.
రెడ్ : ఎయిడ్స్, బ్లడ్ క్యాన్సర్, హార్ట్ డిసీజ్, విపత్తు, వ్యసనం.. లాంటి వాటిపై అవగాహన కల్పించేందుకు పెట్టే మీటింగులలో రెడ్ కలర్ రిబ్బన్లు పెట్టుకుంటారు. దీంతో పాటు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వీటిని ఉపయోగిస్తారు.
గులాబీ : ఈ కలర్ రిబ్బన్ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు దీన్ని అంతర్జాతీయ గుర్తుగా ప్రకటించారు.
గ్రీన్ : కిడ్నీ, లివర్, అవయవదానం, సురక్షితంగా వెహికల్ నడపడం.. లాంటి వాటికి గ్రీన్ కలర్ రెబ్బన్ వాడతారు. గ్లోబల్ వార్మింగ్ తెలిపే సందర్భాల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు.
బ్లాక్ : డిమాండ్ల కోసం.. నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు బ్లాక్ కలర్ రిబ్బన్ లను వాడతారు. దీంతో పాటు చనిపోయిన వాళ్లకు సంతాప సూచికగా నివాళి అర్పించేటప్పుడు ఈ రంగు రిబ్బన్ లు పెట్టుకుంటారు.
పసుపు : యుద్ధ ఖైదీలు, తప్పిపోయిన వాళ్ల కోసం ఏర్పాటు చేసిన మీటింగ్లో పసుపురంగు పట్టీలను పెట్టుకుంటారు. ఆత్మహత్యల నివారణకు, ఎముకల క్యాన్సర్ వాటి అవగాహనకు నిర్వహించే సదస్సుల్లో కూడా వీటిని పెట్టుకుంటారు.
బ్లూ : ఈ రిబ్బన్లను దాదాపు వందకు పైగా సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వ్యభిచార వృత్తిలో దించడం, బెదిరింపులకు వ్యతిరేకంగా ఈ రిబ్బన్లు పెట్టుకుంటారు. నీళ్లు పొదుపుగా వాడడంపై అవగాహన కల్పించే టైంలో కూడా బ్లూ కలర్ రిబ్బన్లను ఇస్తారు.