అక్షయ తృతీయ 2025: ఏ రాశి వారు ఏ వస్తువులు కొనాలి.. ఏ రంగు వస్తువులుఉపయోగించాలి

అక్షయ తృతీయ 2025:  ఏ రాశి వారు ఏ వస్తువులు కొనాలి..  ఏ రంగు వస్తువులుఉపయోగించాలి

అక్షయ తృతీయకు హిందువులు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంశుక్ష పక్షం తదియ రోజున  అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు.  ఈ ఏడాది ఏప్రిల్​ 30 వ తేదీన  అక్షయ తృతీయ వచ్చింది.  ఆ రోజులక్ష్మీ దేవిని పూజించడం.. కొత్త వస్తువులు కొనుగోలు చేయడం .. ఎంతోకొంత బంగారం కొనడానికి ప్లాన్​ చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఏపని చేసినా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఆ రోజున బంగారంతో  పాటు మరికొన్ని వస్తువులు కొంటే లక్ష్మీదేవి, కుభేర స్వామి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఏ రాశి వారు ఏ రంగు వస్తువులు కొనాలో తెలుసుకుందాం. . .  .

మేష రాశి:  ఈ రాశికి అధిపతి కుజుడు.  అక్షయ తృతీయ రోజున ఈ రాశి వారు ఎరుపురంగులో ఉన్నవస్తువులు కొనాలని పండితులు సూచిస్తున్నారు.  రాగి పాత్రలు కొనుగోలు చేసి.. పూజ చేసే సమయంలో వాటిని ఉపయోగిస్తే చాలా అంతా మంచే జరిగి.. సంకల్పం నెరవేరుతుందని చెబుతున్నారు.  అయితే ఎలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు నలుపు.. గోధుమరంగు వస్తువులు కొనకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

వృషభ రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి.. ఈ రాశి వారు బియ్యంతో పాటు.. వెండి.. మినుములు.. ఆవులను కొనుగోలు చేయాలి.  గోదానం చేస్తే ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.  పేదలకు అన్నదానం చేయాలి.  బ్లూ.. క్రీమ్​.. వైట్​ కలర్​ ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటే  కొంటే ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది.  అయితే ఎట్టి పరిస్థితుల్లో పింక్​.. ఎల్లో కలర్​ వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. 

మిథున రాశి: ఈ రాశి వారికి బుధుడు అధిపతి.. అక్షయతృతీయ రోజున ఈ రాశి వారు గ్యాడ్జెట్లు కొనాలి,  గ్రీన్​ కలర్​ దుస్తులు కొని అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన మీకు సానుకూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి.. అక్షయ తృతీయ రోజున ఈ రాశివారు వెండి వస్తువులు కొనాలి.  క్రీమ్​.. ఎల్లోకలర్​ వస్తువులను ఉపయోగించడం వలన మనస్సుప్రశాంతంగా ఉంటుంది. 

సింహ రాశి: ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి.. ఈ రాశి వారు కచ్చితంగా రాగి వస్తువులను కొనాలని పండితులు సూచిస్తున్నారు.  బూడిద రంగు వస్తువులు కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

కన్య రాశి : ఈ రాశి వారి బుధుడు అధిపతి.  ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున తులపి మొక్కను నాటాలి. ఆ తరువాత ఆ మొక్కను పూజించాలి.  తులసి మొక్క అంటే లక్ష్మీదేవితో సమానం కదా..!   తెలుపు.. గోధుమ..  గ్రీన్​.. బ్లూ కలర్​ వస్తువులను వాడాలి. ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎరుపు రంగు వస్తువులు వాడకూడదు. 

తులా రాశి: ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి.. వీరు గ్యాడ్జెట్లు కొనాలి. బ్లూ.. వైట్​.. క్రీమ్​ కలర్​ వస్తువులను కొనుగోలు చేయాలి.. గోమాతను పూజించి .. తోటకూరను ఆహారంగా ఇవ్వాలి.  ఇలా చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. 

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కుజుడు అధిపతి. ఈ రాశి వారు బార్లీ గింజలను కొనుగోలు చేయాలి.  ఎరుపు.. తెలుపు రంగు వస్తువులను వాడాలి.వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చన జరిపించాలి.   పేదలకు వస్త్రదానం చేయడం వలన ఆదాయం పెరిగే అవకాశంఉందని పండితులు సూచిస్తున్నారు. 

ధనస్సు రాశి : ఈ రాశి వారికి గురుడు అధిపతి.. ఈ రాశి వారు ఇత్తడి పాత్రలను కొనుగోలు చేయాలి. పసుపు.. ఆరంజ్​.. సిల్వర్​.. కుంకుమ .. కలర్స్​ లో ఉండే వస్తువులను వాడాలి.  దుర్గా దేవిని  పూజించాలి.  ఇలా చేయడం వలన అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

మకర రాశి : ఈ రాశి వారికి శని దేవుడు అధిపతి.. ఈ రాశి వారు వెండి వస్తువులు.. నల్ల నువ్వులు కొనాలి.  నల్లనువ్వులను దానం ఇవ్వాలి.  లేదంటే శని విగ్రహం దగ్గర సమర్పించాలి. నలుపు, నీలం, బూడిద, తెలుపు రంగుల వస్తువులను ఉపయోగించాలి.  శివాలయంలో అభిషేకం.. చేయాలి.  విష్ణుసహస్రనామం చదవాలి.  చదడవం రాకపోతే శ్రద్దగా వినాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

కుంభ రాశి : ఈ రాశి వారికి కూడా శని దేవుడే అధిపతి. ఈ రాశి వారు కొత్త బట్టలు కొనుగోలు చేయాలి.   అయితే ఈ రాశి వారు బూడిద, డార్క్ బ్లూ, బ్లాక్, బ్రౌన్, సిల్వర్​ కలర్స్​ వస్తువులను ఉపయోగించాలి.  హనమంతుడిని పూజించాలి.  ఇలా చేయడం వలన ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. 

మీన రాశి: ఈ రాశి వారికి గురుడు అధిపతి.  ఈ రాశి వారు బార్లీ.. పసుపు వంటి వస్తవులు కొనాలి. ఈ రాశి వారు ఎల్లో.. వైట్​.. కుంకుమ.. గోల్డ్​ కలర్​ వస్తువులు ఉపయోగించాలి. ఇలా చేయడం వలన గురుడు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.