రామ్ లల్లాకు ప్రధాని మోదీ ఏం కానుక ఇచ్చారు.. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..

అయోధ్య రామమందిరంలో శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానిమోదీ సహ ప్రముఖలు హాజరయ్యారు. అయోధ్య రామయ్య దేశ విదేశాలనుంచి కానుకలు పంపారు భక్తులు. సీతమ్మవారి తల్లిగారి ఊరైన నేపాల్ నుంచి చీరె సారెలు వచ్చాయి. అయితే రామమందిరంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టా మహోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ కూడా ఓ కానుక స్వామివారికి సమర్పించుకున్నారు. ఆ కానుక ఏంటీ.. మతపరంగా దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.. 

హిందూ ఆచారాలలో వెండి గొడుగులు దేవతలను అలంకరించడానికి,వారిని కీర్తించడానికి సమర్పిస్తారు. పురాతన కాలంలో రాజులు, చక్రవర్తుల సింహాసనంపై వెండి పందిరి ఉండేది. రాములు  రఘువంశీకుడు. అయోధ్య సింహాసనానని స్వాధీనం చేసుకున్నాడు. అందుకే అతను రాజు  చిహ్నం, గౌరవ చిహ్నంగా వెండి గొడుగును ప్రధాని మోదీ సమర్పించారు. 

వెండిగొడుగు మతపరమైన ప్రాముఖ్యత 

మత విశ్వాసాల ప్రకారం.. వెండి గొడుగు శక్తికి సూచిక. రాజుకు క్షత్రపతి అనే బిరుదు ఇవ్వడానికి వెండి గొడుగును ఉపయోగిస్తారు. దేవతలకు ఈవెండి గొడుగు వారి సౌరభాన్ని సూచిస్తుంది. 

హిందూ మతంలో విష్ణువు క్షీర సాగరంలో నిద్రిస్తున్నట్లు చూపబడింది. మిగిలిన పాములు ఆయన తలపై గొడుగు రూపంలో ఉంటాయి. లక్ష్మీదేవీ విగ్రహంలో ఏనుగులు తమ తొండం నుంచి నీటిని కురిపిస్తున్నట్లు చూపబడ్డాయి. ఈ గొడుగు హిందూమతంలోని దేవతలు, దేవతల దైవిక శక్తిని సూచిస్తుందట. అందుకే శ్రీరాముని ప్రతి ఆలయంలో అయన విగ్రహంపై గొడుగు స్వామివారి వైభవాన్ని తెలియజేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.