తండ్రి సేవింగ్స్‌ను తుడిచి పెట్టేసిన టీనేజర్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఓ టీనేజర్(17) పబ్‌జీ కోసం ఏకంగా రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తన పబ్‌జీ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడాని కి ఈ డబ్బులను వాడాడు. పంజాబ్‌లోని ఖరర్‌లో ఉంటున్న ఈ అబ్బాయి, తన తండ్రి పొదుపు మొత్తాన్నంతా ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేశాడు. కేవలం తన కోసమే కాకుండా తన టీమ్ కోసం యాప్ పర్చేజ్‌లు చేశాడు. తమ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూశాక కానీ ఈ అబ్బాయి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియలేదు.వాళ్ల అమ్మ మొబైల్ నుంచి ఈట్రాన్సాక్షన్లు చేశాడని, బ్యాంక్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేవాడని ఈ అబ్బాయి నాన్నచెప్పారు. ఎప్పుడూ ఫోన్ పట్టుకొని ఉంటే స్టడీ కోసమని అనుకున్నామని ఆయన వాపోయారు. ఈ అబ్బాయిని ఒక రిపేర్ షాప్‌లో పనికిపెట్టామని, ఆన్‌లైన్ స్టడీ కోసమైనా ఇక మొబైల్ ఇవ్వమని చెప్పుకొచ్చారు.